నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం తిమ్మినోని పల్లి గ్రామంలో మంగళవారం ఒక రైతుకు చెందిన మూడు పాడి ఆవులు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. సోమవారం సాయంత్రం కురిసిన వర్షం సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో రైతు లింగంకు దాదాపు రెండు లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది.