ఎన్నికల హామీ మేరకు, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం తెలిపారు. జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని గమనించే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు.