స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ కార్యక్రమం రద్దు చేయబడుతుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.