షాద్ నగర్ లోని నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహం ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేయాలని సోమవారం విద్యార్థినులు డిమాండ్ చేశారు. గతంలో సూర్యపేటలో ఆమె వ్యవహరించిన తీరు వల్ల ఇక్కడికి బదిలీ అయ్యారని, ప్రిన్సిపల్ గదిలో బీర్ బాటిళ్లు దొరికాయని విద్యార్థినులు ఆరోపించారు. ప్రిన్సిపల్ ప్రవర్తనపై విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.