ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం కొత్తకోట మండలం పాలెం, కానాయపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన వెంటనే సీరియల్ నంబర్ల వారీగా ఎంత ధాన్యం తెచ్చారు, తేమ శాతం ఎంత అనేది రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్