వనపర్తి జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలో బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణానికి రూ.13.15 కోట్ల నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే తూడిమేఘా రెడ్డికి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మండ్ల దేవన్న నాయుడు ధన్యవాదాలు తెలిపారు. విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి, ఇప్పటికే విద్యార్థులకు కాస్మెటిక్స్ చార్జీలు పెంచి, ప్రతి విద్యార్థికి అవసరమైన అన్ని సదుపాయాలు అందిస్తున్నారని దేవన్న నాయుడు పేర్కొన్నారు.