వనపర్తి: కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ బాలిక చికిత్స పొందుతూ మృతి

వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఐదేళ్ల రమ్య అనే బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆదివారం తెల్లవారుజామున కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు పెబ్బేరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు నాలుగు ఇంజెక్షన్లు ఇచ్చిన తర్వాత బాలిక పరిస్థితి విషమించి, పేగు మడత పడిందని మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ కు తరలించాలని సూచించారు. మహబూబ్ నగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్