పర్యావరణ సమతుల్యానికి మొక్కలు ఎంతగానో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో వనపర్తిలోని ఎకోపార్కులో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ విజయేంద్రబొయితో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తు చేశారు.