వనపర్తి: జూరాలకు తగ్గిన వరద... 4 గేట్లు ఎత్తివేత

వనపర్తి జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఎగువ ప్రాంతం నుంచి 1,45,000 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా, నాలుగు గేట్లు పైకెత్తి 99,548 క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలానికి వదులుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాలలో ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.068 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సంబంధిత పోస్ట్