ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో, వనపర్తి పట్టణ బీజేపీ అధ్యక్షులు, అయ్యప్ప మాల ధరించిన రాజశేఖర్ స్వామి ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రం నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని బీచుపల్లి ఆంజనేయస్వామి దేవాలయం వరకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా రాజశేఖర్ స్వామి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశాన్ని రక్షిస్తున్న సైన్యానికి మరింత శక్తిని ఆ దేవుడు చేకూర్చాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.