ఆర్థిక స్తోమత లేని కారణంగా హామీ పత్రం డబ్బులు చెల్లించలేని విచారణ ఖైదీల బెయిల్ విషయంలో వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం జిల్లా స్థాయి సాధికార కమిటీ వెబ్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. కమిటీ ద్వారా హామీ పత్రం, డబ్బులు మాఫీ చేసి, జైలు నుంచి విడుదలకు అనుమతి లభించిన వారిని విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ చర్యల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ఖైదీలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు.