బావిలో పడి మహిళ మృతి: వీపనగండ్ల పోలీసుల విచారణ

వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో సింగనమణి అంజనమ్మ (50) అనే మహిళ మంచినీళ్ళ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో కుమార్తె వద్ద ఉంటూ మేస్త్రీ పనులు చేసుకునే అంజనమ్మ, రెండు రోజుల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఆమె బావిలో పడి మరణించింది. ఈ ఘటనపై వీపనగండ్ల పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్