ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది 'మహావతార్ నరసింహ'. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 50 రోజులైన సందర్భంగా నిర్మాణ సంస్థ డిలీటెడ్ సీన్ వీడియోను పంచుకుంది. 50 రోజులైనా ఇంకా 200కు పైగా థియేటర్లలో ఈ సినిమా ఆడుతోందని తెలిపింది. ఇప్పటి వరకూ 'మహావతార్ నరసింహ' రూ.300 కోట్లు వసూళ్లు చేసిన విషయం తెలిసిందే.