OTTలోకి 'మహావతార్‌ నరసింహ'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

చిన్న యానిమేటెడ్‌ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ‘మహావతార్‌ నరసింహ’. ఈ సినిమా ఇప్పటి వరకూ రూ.300కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం OTT ప్రేక్షకులను సైతం అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా 'మహావతార్‌ నరసింహ' మూవీ సెప్టెంబర్ 19 మధ్యాహ్నం 12.30 గంటల నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా గురువారం ప్రకటన చేసింది.

సంబంధిత పోస్ట్