లిఫ్ట్‌లో కుక్కపిల్లను కొట్టి చంపిన పని మనిషి.. వీడియో

ఓ పని మనిషి కుక్కపిల్లను దారుణంగా కొట్టి చంపిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. రాశి పుజారీ అనే మహిళ తన పనిమనిషి పుష్పలత పై నమ్మకంతో పెంపుడు కుక్క పిల్లను సంరక్షించమని బాధ్యత అప్పగించారు. కానీ ఆమె కుక్కపిల్లను లిఫ్ట్‌లోకి తీసుకెళ్లి అతి క్రూరంగా నెలకేసి కొట్టి చంపింది. ఈ ఘటన అక్టోబర్ 31న జరిగింది. ఈ మేరకు యజమాని రాశి పనిమనిషిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పుష్పలతను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు పనిమనిషిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్