బిహార్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా భద్రతలో భారీ లోపం ఏర్పడినట్లు నివేదికలు తెలిపాయి. అమిత్ షా కాన్వాయ్ సమస్తిపూర్కు ప్రయాణించేందుకు పాట్నా విమానాశ్రయానికి చేరుకునే ముందు, ఒక గుర్తు తెలియని వాహనం ఆయన ముందు ఆగింది. సదరు కారును చూసి భద్రతా దళాలు ఆందోళన చెందాయి. దీంతో అక్కడ ఉన్న పోలీసు అధికారులు దానిని పక్కకు తరలించమని కేకలు వేశారు.