శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, బుధవారం ఉదయం శ్రీమలయప్పస్వామి చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే, ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండటం విశేషం. కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బుధవారం ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవతో వాహన సేవలు ముగియనున్నాయి. ఎల్లుండి పుష్కరిణిలో చక్రత్తాళ్వారుకు స్నపన తిరుమంజనం, రాత్రికి ధ్వజావహరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.