కర్ణాటక మైసూర్‌లోని BM హాబిటాట్ షాపింగ్ మాల్‌లో సోమవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. షాపింగ్ మాల్ నాలుగో అంతస్తు నుంచి పడి ఇద్దరు మృతి చెందారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విరిగిపోయి ఇద్దరు ఎలక్ట్రీషియన్స్ పైనుంచి కిందకు పడిపోయారు. పడిపోతున్న ఒకరిని కాపాడబోయి మరోవ్యక్తి కూడా జారిపడ్డాడు. ఈ ప్రమాదంలో సునీల్ (27) స్పాట్‌లోనే మరణించగా, చంద్రు(22) తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.