కదులుతున్న బస్సు నుంచి జారిపడి వ్యక్తి మృతి(వీడియో)

ఫుట్ బోర్డుపై ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ మేరకు కదులుతున్న బస్సు నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ బస్సు ఫుట్ బోర్డుపై కొందరు ప్రయాణికులు నిలబడి ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు కుదుపునకు గురికావడంతో ఓ ప్రయాణికుడు కింద పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్