ఒక మహిళను బైక్‌పై వెళ్తూ అనుచితంగా తాకిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ ఘటనలో, ఆకతాయి ఒక బైక్‌పై వచ్చి మహిళను తాకి పారిపోవడం కనిపిస్తుంది. మహిళపై వేధింపులకు పాల్పడిన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.