పామును మెడలో వేసుకొని వ్యక్తి హల్‌చల్‌.. వీడియో వైరల్

AP: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి పాముతో ఆటలాడుతూ ప్రమాదంలో పడ్డాడు. కమిని పంచాయతీకి చెందిన గొల్లపల్లి కొండ కోళ్ల గంపలో చేయిపెట్టగా పాము కాటేసింది. అనంతరం దానిని మెడలో వేసుకొని తిరగడంతో మరోసారి పాము కాటు వేసింది. స్థానికులు పామును చంపి, గాయపడిన అతడిని మొదట టి.కొత్తపల్లి ఆసుపత్రికి, తరువాత కాకినాడకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్