బెల్లంపల్లిలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు కోసం దారిద్యరేఖకు దిగువన ఉన్న అర్హత కలిగిన కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని తాసిల్దార్ కృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన అర్హులు మీసేవ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, మొబైల్ నెంబర్ తో ఈనెల 6 నుంచి 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.