బెల్లంపల్లి: పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది

నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం బెల్లంపల్లి మండలానికి సంబంధించిన 77 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ కు చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని స్పష్టం చేశారు. పేదింటి ఆడపడుచుల వివాహాలకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు వెన్నంటే నిలుస్తాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్