బెల్లంపల్లి: రెండో రోజు కొనసాగిన అక్రమ నిర్మాణాల కూల్చివేత

బెల్లంపల్లి పట్టణంలో రెండవ రోజు రోడ్డు వెడల్పు పనులలో భాగంగా శనివారం అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగింది. కాంటా చౌరస్తాలోని తాత్కాలిక చికెన్ దుకాణాలు, షెడ్లు, ఇతర నిర్మాణాలను జెసిబి సాయంతో మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎసిపి రవికుమార్, సిఐలు శ్రీనివాసరావు, దేవయ్య, హనోక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్