బెల్లంపల్లి: వైభవంగా 12 నదుల నీటిచే గంగా హారతి

బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ శివారులోని శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో కోనేటిలో 12 నదుల నీటితో పెద్ద ఎత్తున గంగా హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ శ్రీదేవి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో జరిగిన ఈ కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా భారీ ఎత్తున భక్తులు హాజరై తిలకించారు. ఈ గంగా హారతి కార్యక్రమం కనుల పండగగా సాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్