బెల్లంపల్లి మున్సిపాలిటీ ప్లంబర్ డిపార్ట్మెంట్ కార్మికులు ఆదివారం తమకు స్కిల్ వేతనం చెల్లించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి తమ సమస్యను వివరించిన కార్మికుల విజ్ఞప్తి మేరకు, ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్ కుమార్ దీపక్ తో మాట్లాడి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కిల్ వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.