బెల్లంపల్లి: జాతీయ సమైక్యతలో భాగస్వామ్యం కావాలి

భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బెల్లంపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమం ఘనంగా జరిగింది. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ రన్ ను ప్రారంభించారు. కుల, మత, లింగ భేదాలు లేకుండా ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ హనోక్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్