వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ ఆధ్వర్యంలో ముల్కలపేట గ్రామానికి చెందిన రంగు శంకర్ గౌడ్, రంగు బాపు గౌడ్, ఎల్కరి రవి బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కోడి రమేష్ వీరికి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు ఎనుముల వెంకటేష్, కొప్పుల చరణ్ రాజ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మడే శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షులు ముల్కల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.