జిల్లా వైద్య అధికారి అనిత ఆదేశాల మేరకు చెన్నూరు, మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పొగాకు ఉత్పత్తుల నివారణ, సీపీఆర్ పై ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వైద్యాధికారి రమేష్, డాక్టర్ మానస, ఎన్.సి.డి ప్రోగ్రాం ఇంచార్జి లింగారెడ్డి మాట్లాడుతూ, సీపీఆర్ ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని, పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ వంటి అనేక వ్యాధులు వస్తున్నాయని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించి మరణాలు తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.