భీమారం మండలానికి చెందిన మెండే పున్నం, బోయిన మహేష్ అనే ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 30న జరిగిన పెళ్లి వేడుకలో డిజె పాటలు పెట్టడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అక్కడికి చేరుకున్న బ్లూ కోల్డ్స్ కానిస్టేబుల్ సమ్మయ్య విధులకు ఆటంకం కలిగించి, దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఇద్దరితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి ఎస్ఐ లక్ష్మీప్రసన్న తెలిపారు. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.