చెన్నూరు: చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

శనివారం చెన్నూరు మండలంలోని అక్కయ్యపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ (21) గోదావరిలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. యువకుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్బారావు వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్