శుక్రవారం ఆత్మహత్య చేసుకున్న బిజెపి మండల అధ్యక్షుడు మధుకర్ అంతిమయాత్ర శనివారం వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు, మాజీ ఎంపీ వెంకటేష్ నేత పాల్గొని మధుకర్ పాడే మోశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.