జైపూర్ మండలంలోని కుందారం గ్రామంలో కర్రలు పట్టుకొని గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసి, కొందరిపై దాడికి పాల్పడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మారం అజయ్ అనే మరో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్, ఎస్సై శ్రీధర్ మంగళవారం తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.