మందమర్రి ఏరియాలో సెప్టెంబర్ నెలలో 56 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం రాధాకృష్ణ తెలిపారు. మంగళవారం జీవం కార్యాలయంలో బొగ్గు ఉత్పత్తి వివరాలను ఆయన వెల్లడించారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యం రెండు లక్షల 45 వేల టన్నులు కాగా, ఒక లక్ష 15 వేల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్లు పేర్కొన్నారు. రాబోవు నెలల్లో అండర్ గ్రౌండ్ గనుల్లో హాజరు శాతాన్ని పెంచి ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.