మందమర్రి: కూతురు పుట్టిందని మైసమ్మకు మెట్ల నిర్మాణం

రామకృష్ణాపూర్ మండలం శ్రీ గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి వద్ద సోమవారం ఒక తండ్రి తన మొక్కు చెల్లించుకున్నాడు. మందమర్రి మండలం గద్దె రాగడికి చెందిన అనిల్, తనకు అమ్మాయి పుట్టిందని, అది అమ్మవారి అనుగ్రహంతోనే కలిగిందని నమ్మి, ఖిల్లా పైకి వెళ్లే దారిలో మెట్ల నిర్మాణం చేయించాడు. అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించాడు. ఇలా కూతురు పుట్టిన సంతోషాన్ని మొక్కు రూపంలో తీర్చుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్