మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ద్వారాక గ్రామానికి చెందిన కాటుకూరి లక్ష్మి మృతి చెందడంతో, ఆమె నిరుపేద కుటుంబాన్ని పరామర్శించిన రాయల్ వినాయక గ్రూప్ యూత్ సభ్యులు శనివారం రూ.10,516 ఆర్థిక సహాయాన్ని ఆమె కుమారుడు కాటుకూరి శంకర్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సాయినీ, ప్రవీణ్, సూరినేని శంకర్, జె.విజయ్, ఆర్.గణేష్, మాజీ ఉపసర్పంచ్ ప్రతాప్, రజక సంఘ అధ్యక్షుడు మందపెల్లి వెంకటేష్ పాల్గొన్నారు.