దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన గనిశెట్టి కార్తీక్ ఇంట్లో అటవీ శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. తాళ్లపేట ఎఫ్ఆర్ఓ సుష్మారావు, డాగ్ స్క్వాడ్ అనిల్, హంటర్ సిబ్బందితో కలిసి ఈ దాడులు చేపట్టారు. కార్తీక్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎనిమిది కలప దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 33,606 రూపాయలు ఉంటుందని అంచనా. స్వాధీనం చేసుకున్న కలపను తాళ్లపేట అటవీ రేంజ్ కు తరలించారు. అక్రమ కలప రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.