మంగళవారం జన్నారం మండలం సింగరాయపేట వద్ద లారీ ఢీకొని అండయ్ మారుతి (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కొమరం నాగరాజు అనే మరో వ్యక్తి గాయపడ్డాడు. రోజువారీ కూలీ కోసం కాంక్రీట్ మిల్లర్ పనికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఎస్ఐ అనూష తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.