మంచిర్యాల: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రవీంద్రఖని రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నస్పూర్ మండలం సింగపూర్ గ్రామానికి చెందిన జాన శ్రీనివాస్ (39) ఆదివారం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడి వెళ్లిపోయినట్లు తెలిపారు. సోమవారం ఉదయం మంచిర్యాల రవీంద్రఖని రైల్వే స్టేషన్ ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే జి ఆర్ పి ఎస్.ఐ మహేందర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్