మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ఆవరణల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. పెండింగ్ లో ఉన్న కేసుల్లోని కక్షిదారులతో మాట్లాడి, రాజీ కుదిర్చే విధంగా కృషి చేయాలని ఆయన సూచించారు. బ్యాంక్ రికవరీ, సివిల్ మోటార్ వెహికల్ యాక్ట్ వంటి కేసులను పరిష్కరించేందుకు ఈ లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.