మంచిర్యాల: స్థానిక ఎన్నికల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

శనివారం మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు యువకులు బహుజన సమాజ్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర నాయకులు రవీందర్, జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంటింటికి బహుజన సమాజ్ పార్టీని తీసుకెళ్లాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలోని అన్ని స్థానాలు కైవసం చేసుకునేలా పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తున్నామని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్