మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నస్పూర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని సీతారాంపల్లి, పటేల్ కాలనీ, మల్లికార్జున నగర్, కీర్తి వాటర్ ప్లాంట్ ఏరియా, పోషన్న కాలనీ, కాకతీయ హిల్స్, ఉమామహేశ్వర కాలనీ, పద్మావతి టౌన్షిప్, వినాయక టౌన్షిప్, రాజరాజేశ్వర టౌన్షిప్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. నస్పూర్ టౌన్ 11 కె. వి ఫీడర్ లో సీతారాంపల్లి రోడ్ లో మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని ఏఈ రామచందర్ తెలిపారు. వినియోగదారుల సహకారం కోరారు.