గ్రేట్ ఆంధ్రా జర్నలిస్ట్ VSN మూర్తి పై నటి మంచు లక్ష్మి ఫిల్మ్ ఛాంబర్‌కి కంప్లైంట్ చేశారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో తనని అడిగిన ప్రశ్న… తన డిగ్నిటీకి భంగం కలిగిస్తుందంటూ కంప్లైంట్‌లో పేర్కొన్నారు. తన వయసు, వేసుకునే బట్టల మీద ప్రశ్న అడగడంపై కంప్లైంట్ చేశారు. ‘అది ఇంటర్వ్యూ కాదు.. అటాక్’ అంటూ మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇది జర్నలిజం కాదు, క్రిటిక్ కూడా కాదు.. పాపులర్, వైరల్ అవ్వడం కోసం చేస్తున్నారు’ అని ఆమె ఆరోపించారు.