ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడలో గురువారం భద్రతా దళాలపై మావోయిస్టులు దాడులు చేశారు. బర్సూర్-పల్లి రోడ్డులో భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో ఇద్దరు CRPF జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి.