భారీ భూకంపం.. 20 మంది మృతి (వీడియో)

అఫ్గానిస్థాన్‌లోని ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.0 భూకంప తీవ్రత నమోదైంది. వందలాది మంది మరణించి ఉంటారని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పటివరకు 20 మంది మరణించారని ప్రకటించింది. వందల మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. అఫ్గానిస్థాన్-పాక్ సరిహద్దుల్లోని కునార్, నంగర్‌హార్ ప్రావిన్స్‌లో భూకంప తీవ్రత అధికంగా ఉంది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్థాన్, తజికిస్థాన్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి.

సంబంధిత పోస్ట్