సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సెబు ప్రావిన్స్‌లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా బోగో నగరంలో దాదాపు 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకంపనల ధాటికి పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో మరికొంతమంది మరణించగా, గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.