అఫ్గానిస్థాన్‌లో జరిగిన భూకంపం ధాటికి 600 మందికి పైగా మరణించగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జలాలాబాద్‌కు తూర్పు-ఈశాన్య దిశలో 8 కి.మీ. లోతులో భూకంపం సంభవించింది. భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను హెలీకాఫ్టర్లలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని అంతర్జాతీయ సహకారాన్ని అక్కడి తాలిబన్ ప్రభుత్వం కోరుతోంది.