దక్షిణ అమెరికాలో డ్రేక్ ప్యాసేజ్ వద్ద భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 8.0గా నమోదైంది. అయితే ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఎటువంటి సమాచారం రాలేదు. సౌత్ అమెరికాకు, అంటార్కిటాకు మధ్యలో ఉన్న డ్రేక్ ప్యాసేజ్ అనే ప్రదేశంలో ఈ భూకంపం సంభవించింది. ఇది సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం. దీంతో అక్కడ ఆందోళన నెలకొంది.