రష్యాలోని సఖాలిన్ ఒబ్లాస్ట్‌లోని సెవెరో-కురిల్స్క్ సమీపంలో సోమవారం ఉదయం 10:49 గంటలకు 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. యూరోపియన్ -మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపిన వివరాల ప్రకారం, భూకంపం 126 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈ ప్రకంపనలతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. అయితే, ఈ భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.