పాకిస్థాన్ సుప్రీంకోర్టు భవనంలో జరిగిన భారీ పేలుడులో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం.. సుప్రీంకోర్టు బేస్మెంట్ క్యాంటీన్‌లో గ్యాస్ సిలిండర్ పేలిపోవడం వల్ల ఈ ఘటన జరిగింది. అయితే, స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ మరమ్మతుల సమయంలో ఈ పేలుడు సంభవించిందని నిఘా వర్గాలు నిర్ధారించాయి. పాక్ మీడియా ప్రకారం.. సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ మరమ్మతు పనులు జరుగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.